32 రూపాయలు పెరగనున్న పెట్రోల్ ధర..?

Pakistan likely to increase petrol. పాకిస్థాన్ అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

By M.S.R  Published on  15 Feb 2023 4:49 PM IST
32 రూపాయలు పెరగనున్న పెట్రోల్ ధర..?

పాకిస్థాన్ అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పాక్ ప్రజలు కూడా కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఫిబ్రవరి 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.32 పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్ ధరలు మరింత పెరిగాయని అంటున్నారు. ఆర్థిక మాంద్యం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు 12.8 శాతం లేదా PKR 32.07 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పాకిస్థాన్ కరెన్సీ భారీగా తగ్గుతోంది, చమురు దిగుమతుల వ్యయం పెరగడం వంటి కారణాలతో పాకిస్థాన్‌లో కొంతకాలంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం గతంలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 35 రూపాయల చొప్పున పెంచింది.

పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం కూడా తారా స్థాయికి చేరింది. ఆహార పదార్థాల ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పాల ధర పాకిస్థాన్ కరెన్సీలో రూ. 210 కి పైనే ఉంది. కిలో లైవ్ బ్రాయిలర్ కోడి ధర రూ. 500 పలుకుతుండగా.. కిలో చికెన్ ధర రూ. 780 కి విక్రయిస్తున్నారు. ఇక బోన్‌లెస్ మాంసం అయితే కిలోకి ఏకంగా రూ. 1100 వరకు పలుకుతోంది.



Next Story