పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35 రూపాయలు పెంచేసిన ప్రభుత్వం

Pakistan govt lifts petrol, diesel prices by Rs 35 per litre. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజల మీద మరో భారం వేసింది. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 35 రూపాయలు పెంచేసింది

By M.S.R  Published on  29 Jan 2023 1:20 PM GMT
పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35 రూపాయలు పెంచేసిన ప్రభుత్వం

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజల మీద మరో భారం వేసింది. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 35 రూపాయలు పెంచేసింది. అదే సమయంలో కిరోసిన్, లైట్ డీజిల్ ఆయిల్ లీటర్‌కు 18 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. తాజా ధరల ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర 249, లీటర్ డీజిల్ ధర 262 రూపాయలకు పెరిగింది. లీటర్ కిరోసిన్ ధర 189, లీటర్ లైట్ డీజిల్ ధర 187కు పెరిగింది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు పెట్రో ధరలు పెంచినట్లు తెలుస్తోంది. 2022లో సంభవించిన ఘోరమైన వరదలతో పాటు, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు రూ.35 చొప్పున పెంచాల్సి వచ్చింది.

అమెరికా డాల‌ర్‌తో పాకిస్తాన్ కరెన్సీ శ‌నివారం భారీగా ప‌త‌న‌మ‌వ‌డంతో పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెరిగాయి. విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు అడుగంట‌డంతో పాకిస్తాన్ కేవ‌లం మూడు వారాలకు స‌రిప‌డా దిగుమతుల‌కు మాత్ర‌మే చెల్లింపులు జ‌రిపే వెసులుబాటు ఉంది. సంక్షోభం అధిగ‌మించేందుకు ఐఎంఎఫ్ విడుద‌ల చేసే త‌దుపరి 100 కోట్ల డాల‌ర్ల బెయిల్ అవుట్ ప్రోగ్రాం కోసం పాకిస్తాన్ ఎదురుచూస్తూ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫార్సుల మేరకే రేట్ల పెంపుదల చేపట్టామని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.


Next Story