హిందూ దేవాలయంలో పాకిస్తాన్‌ ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు..!

Pakistan CJ inaugurates rebuilt Hindu temple. పాకిస్తాన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌.. అక్కడి మైనార్టీలుగా ఉన్న హిందువులకు అండగా నిలిచారు. ఓ హిందూ

By అంజి  Published on  10 Nov 2021 4:57 AM GMT
హిందూ దేవాలయంలో పాకిస్తాన్‌ ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు..!

పాకిస్తాన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌.. అక్కడి మైనార్టీలుగా ఉన్న హిందువులకు అండగా నిలిచారు. ఓ హిందూ ఆలయం పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గతే సంవత్సరం కరాక్‌ జిల్లాలోని తేరి గ్రామంలో ఉన్న శ్రీపరమ హన్స్‌ జీ మహారాజ్‌ ప్రాచీన దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అప్పట్లో పాకిస్తాన్‌ చీఫ్‌ జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్‌ గవర్నమెంట్‌ ఆలయాన్ని వెంటనే పునర్మించాలని ఆదేశించారు. ఆలయ పునః నిర్మాణానికి అయ్యే ఖర్చు.. ఆలయాన్ని ధ్వంసం చేసిన వారి నుంచే తీసుకోవాలని ఆర్డర్స్‌ ఇచ్చారు.

దీంతో రూరల్‌ గవర్నమెంట్‌ ధ్వంసమైన ఆలయాన్ని మళ్లీ నిర్మించింది. దీపావళి పండగ నేపథ్యంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం రోజు ఆలయ తలుపులను తిరిగి తెరిచారు. స్థానిక హిందువులు ఆలయ పునః ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్‌ జస్టిస్‌ హాజరయ్యారు. దీపావళి పండుగను జరుపుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ గుల్జార్ అహ్మద్‌ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ ఉన్నత న్యాయస్థానం ఎప్పటికీ మైనార్టీల హక్కలను పరిరక్షిస్తుందని తెలిపారు. పాకిస్తాన్‌ రాజ్యాంగం ద్వారా ఇతర మతాల వారికి ఉండే స్వేచ్ఛ, హక్కులు మైనార్టీలుగా ఉన్న హిందువులకు కూడా ఉంటాయన్నారు. పాక్‌ సుప్రీంకోర్టు మత స్వేచ్ఛను కాపాడుతుందన్నారు. ప్రార్థనా మందిరాలు, ఆలయాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు.

Next Story