పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఆ అనుమానాలు తప్పకుండా వ‌స్తాయి : భారత నేవీ చీఫ్ అడ్మిరల్

పాకిస్తాన్ నావికాదళం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోందని, అనేక యుద్ధనౌకలు చైనా మద్దతుతో నిర్మిస్తున్నారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తెలిపారు.

By Medi Samrat  Published on  2 Dec 2024 6:09 PM IST
పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఆ అనుమానాలు తప్పకుండా వ‌స్తాయి : భారత నేవీ చీఫ్ అడ్మిరల్

పాకిస్తాన్ నావికాదళం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోందని, అనేక యుద్ధనౌకలు చైనా మద్దతుతో నిర్మిస్తున్నారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తెలిపారు. చైనా మద్దతుతో ఆశ్చర్యకరంగా పాకిస్థాన్ నౌకాదళ సామర్థ్యాలు బలోపేతమవుతున్నాయని అన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఇన్ని నౌకలను ఎలా నిర్మిస్తున్నారు లేదా ఎలా పొందుతున్నారనే అనుమానాలు తప్పకుండా ఉంటాయన్నారు.

తమ ప్రజల సంక్షేమం కంటే ఆయుధాలను ఎంచుకోవాలని పాకిస్థాన్ నిర్ణయించుకుందని భారత నేవీ చీఫ్ విలేకరుల సమావేశంలో అన్నారు. అనేక పాకిస్తానీ నేవీ యుద్ధనౌకలు, జలాంతర్గాములను చైనా మద్దతుతో నిర్మిస్తున్నారని, పాకిస్తాన్ నౌకాదళాన్ని బలోపేతం చేయడానికి చైనా ఆసక్తిని చూపుతోందన్నారు. ఎనిమిది కొత్త జలాంతర్గాములు పాకిస్తాన్ నేవీ దగ్గర ఉన్నాయని, అయితే వాటి సామర్థ్యాల గురించి భారత్ కు పూర్తిగా తెలుసన్నారు.

Next Story