'నరకం అనుభవిస్తున్నా': 3 నెలలుగా అత్యాచారం.. తండ్రిని కాల్చి చంపిన బాలిక

పాకిస్తాన్‌ దేశంలో మానవత్వం సిగ్గు పడే ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  24 Sept 2023 11:46 AM IST
Pak girl, Crime news, international news

'నరకం అనుభవిస్తున్నా': 3 నెలలుగా అత్యాచారం.. తండ్రిని కాల్చి చంపిన బాలిక

పాకిస్తాన్‌ దేశంలో మానవత్వం సిగ్గు పడే ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక శనివారం తన తండ్రిని కాల్చి చంపిందని పోలీసులు తెలిపారు. లాహోర్ నగరంలోని గుజ్జర్‌పురా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రి గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది.

"తాను నరకం అనుభవిస్తున్నానని, అత్యాచారం చేసిన తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నానని, అందుకే అతని తుపాకీతో కాల్చి చంపానని ఆమె చెప్పింది" అని కేసు దర్యాప్తు చేస్తున్న సోహైల్ కజ్మీ చెప్పారు. దీంతో బాలిక తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు కజ్మీ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నిందితురాలైన బాలికపై కేసు నమోదు చేస్తామని అధికారి తెలిపారు.

తన మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించిన ఒక రోజు తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన నిందితుడు ఎం. రఫీక్‌కు లాహోర్‌లోని లింగ-ఆధారిత హింస కోర్టు అదనపు సెషన్స్ జడ్జి మియాన్ షాహిద్ జావేద్ మరణశిక్ష విధించారు.

Next Story