పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో భారత దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరుతో ప్రకటన విడుదల అయింది. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్, లష్కరే-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున 1.05 గంటలకు భారత్ దాడి చేసింది. పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు 26 మందిని, పర్యాటకులను చంపిన పహల్గామ్ మారణహోమానికి భారతదేశం ప్రతిస్పందనగా 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా బహవల్‌పూర్‌లోని సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై దాడులు రెండు ముఖ్యమైన దాడులలో ఒకటి
మరణించిన వారిలో అజార్ అక్క, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని జైషే మహ్మద్ చీఫ్ ప్రకటనను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా పేర్కొంది. భారత దాడుల్లో అజార్, అతని తల్లి సన్నిహితుడు, మరో ఇద్దరు సన్నిహితులు కూడా మరణించారని ఆ ప్రకటనలో పేర్కొంది.