వాషింగ్ట‌న్ డీసీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఒక‌రి మృతి

One minor feared dead cop among 3 injured in Washington DC shooting.అగ్ర‌రాజ్యం అమెరికాలో నానాటికి గన్‌కల్చర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2022 5:57 AM GMT
వాషింగ్ట‌న్ డీసీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఒక‌రి మృతి

అగ్ర‌రాజ్యం అమెరికాలో నానాటికి గన్‌కల్చర్‌ పెరిగిపోతోంది. దీంతో ఇటీవ‌ల కాలంలో అక్క‌డ కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మ‌రోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్ డీసీలోని 14వ యూ స్ట్రీట్‌లో నిర్వ‌హిస్తున్న ఓ మ్యూజిక్ ఈవెంట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఓ యువ‌కుడు మ‌ర‌ణించాడు. ఓ పోలీస్ అధికారి స‌హా ముగ్గురు గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌దేశం వైట్‌హౌస్‌కు కేవ‌లం 2 మైళ్ల దూరంలోనే ఉంద‌ని పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దన్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని, వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డీసీ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది. కాగా.. కాల్పుల‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఇక కాల్పుల‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

టెక్సాస్‌లోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో మే 24న జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 1న ఓక్లహోమాలో ఆసుపత్రి క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు చ‌నిపోయారు.

Next Story