ఈ నెలలో ఏడో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

North Korea tests possibly longest-range missile since 2017. ఉత్తర కొరియా జపాన్ సముద్రం వైపుగా అత్యంత పవర్ ఫుల్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఈ నెలలో ఇది ఏడో క్షిపణి పరీక్ష కావడం

By అంజి  Published on  30 Jan 2022 2:07 PM GMT
ఈ నెలలో ఏడో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా జపాన్ సముద్రం వైపుగా అత్యంత పవర్ ఫుల్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఈ నెలలో ఇది ఏడో క్షిపణి పరీక్ష కావడం గమనార్హం. దీర్షకాలంగా నిలిచిపోయిన అణుచర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర అంతర్గత ప్రాంతం నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్టు అనుమానిస్తున్నారు. దీని రేంజ్ వివరాలు తెలియరాలేదు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం 7.52 గంటలకు ఈ పరీక్ష జరిగినట్టు దక్షిణ కొరియా పేర్కొంది. ఇది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్‌బీఎం) అయి ఉంటుందని, నవంబరు 2017 తర్వాత జరిపిన పరీక్షల్లో అతి పెద్దది ఇదేనని తేలింది. ఉత్తర కొరియా గురువారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత రెండు రోజులకే మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను నిర్వహించింది.

ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఉత్తర కొరియా తన పాత పంథాలోనే నడుచుకుంటూ ఉంది. దౌత్యంలో ఇప్పటికే అమెరికాతో సుదీర్ఘ ప్రతిష్టంభన కొనసాగిస్తూ ఉన్నాడు కిమ్. జపాన్ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి ఈ మిసైల్ మార్గం యొక్క ప్రాథమిక అంచనా ఆధారంగా.. గరిష్టంగా 2,000 కిలోమీటర్ల (1,242 మైళ్ళు) ఎత్తుకు చేరుకుంది. సముద్రంలో దిగడానికి ముందు 800 కిలోమీటర్లు (497 మైళ్ళు) ప్రయాణించింది. అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికా నేతృత్వంలోని ఆంక్షలను దశాబ్దాలు పట్టించుకోవడం లేదు ఉత్తర కొరియా. ఈ పరీక్ష తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశానికి పిలిచారు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇది బాలిస్టిక్ క్షిపణే అయి ఉంటుందని చెబుతున్నాయి.

Next Story