నోబెల్ కమిటీ బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది. సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్ మరియు ఒమర్ యాగీ 2025 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. రసాయనశాస్త్రంలో మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌లో పరిశోధనలకు గాను ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ పురస్కారం వరించింది. సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్ మరియు ఒమర్ ఎం.యాఘికి నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది.
నోబెల్ బహుమతి గ్రహీతలు వాయువులు, ఇతర రసాయనాలు ప్రవహించే అతిపెద్ద ఖాళీలతో పరమాణు నిర్మాణాలను సృష్టించారు. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ ఎడారిగాలి నుండి నీటిని సేకరించడానికి, కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించడానికి, విషవాయువులను నిల్వ చేయడానికి లేదా రసాయన ప్రతిచర్యలను ఉత్ప్రేరీకరించేందుకు వినియోగించవచ్చు.