బహిరంగ మరణశిక్షలపై కీలక ప్రకటన చేసిన తాలిబాన్లు
No Public Executions Unless Directed, Says Taliban In New Diktat. బహిరంగ మరణ శిక్షలపై తాలిబాన్లు కీలక ప్రకటన చేశారు. తమ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు
By M.S.R Published on 16 Oct 2021 3:58 PM ISTబహిరంగ మరణ శిక్షలపై తాలిబాన్లు కీలక ప్రకటన చేశారు. తమ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు బహిరంగ శిక్షలను అమలు చేయబోమని తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణ శిక్షలు, మృతదేహాలను బహిరంగంగా వేలాడదీయడం అమలు చేస్తామని తాలిబాన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. అందుకు మంత్రి మండలి మొత్తం ఆమోదం తెలిపిందన్నారు. శిక్ష విధిస్తే తప్పనిసరిగా అతడు చేసిన నేరమేంటో ప్రజలకు తెలిసేలా చేయాలని తాము నిర్ణయించామని అన్నారు. కాళ్లూచేతుల నరికివేత, ఉరితీత వంటి కఠినమైన శిక్షలను బహిరంగంగా అమలు చేస్తామని గతంలో ఆఫ్ఘనిస్థాన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ తురాబీ చెప్పిన సంగతి తెలిసిందే. ఒకప్పటి తాలిబాన్ ప్రభుత్వం ఘోరమైన శిక్షలను విధించింది.. ఇప్పుడు తిరిగి అధికారం చేపట్టిన తాలిబాన్లు కూడా అదే దారిలో వెళతారనే ప్రపంచ దేశాలు భయపడ్డాయి. ఇప్పుడు అదే నిజమైంది.
కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్ గురుద్వారాలోకి తాలిబాన్లు బలవంతంగా ప్రవేశించారు. తాము 'స్పెషల్ యూనిట్' అంటూ లోపలికి చొరబడి గురుద్వారాను అపవిత్రం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఈ ఘటనపై స్పందించారు. ఆయుధాలతో వచ్చిన తాలిబాన్లు సిక్కులను భయపెట్టారని.. కాబూల్ లోని సిక్కు సమాజం నుంచి తమకు అనేక కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆయుధాలను ధరించిన కొందరు వ్యక్తులు తాము ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక యూనిట్ కు చెందిన వారమని చెపుతూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారని అన్నారు.