పక్క దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్ల బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రభుత్వం మరో 15 రోజుల్లో పెట్రోల్ ధరను (పాకిస్తానీ రూపీ) రూ.10 నుంచి రూ.14 పెంచాలని యోచిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం ఈ పెంపుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.272 గా ఉంది. ఒక వేళ పెట్రోల్ ధర పెంచితే రూ.286కు చేరుతుంది. తదుపరి 15 రోజుల్లో పెట్రోల్ ధరను లీటరుకు రూ.10 చొప్పున పెంచాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.
దేశం యొక్క అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న వడ్డీ రేట్లతో పాటు కరెన్సీ విలువ తగ్గింపు మధ్య ఇది జరిగింది. హై-స్పీడ్ డీజిల్, తేలికపాటి డీజిల్ చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే పెట్రోల్ ధర లీటరుకు రూ. 282కిపైగా పెరగనుంది. పెరిగింది. కిరోసిన్ ఆయిల్ ధర కూడా లీటరుకు (PKR) 5.78 పెరిగింది. "అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఖర్చులు పెరగడం, కరెన్సీ రేటు వ్యత్యాసం" అని పేర్కొంటూ ఫైనాన్స్ విభాగం ఒక ప్రకటనలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలను వివరించింది. జీరో జనరల్ సేల్స్ ట్యాక్స్‌తో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.50 విధిస్తుంది.