భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం హోలీ నేడు వేడుకలలో మునిగిపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హోలీ ఆడుతున్న వీడియోలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కూడా ఎంతో ఉత్సాహంగా హోలీ ఆడుతూ కనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో క్రిస్టోఫర్ లక్సన్ హోలీని ఆస్వాదిస్తున్నట్లు చూడవచ్చు.
వీడియోలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ప్రజలతో కలిసి దేశీ స్టైల్‌లో హోలీ ఆడుతూ కనిపించారు. న్యూజిలాండ్‌లోని ఇస్కాన్ ఆలయంలోని నిర్వహించిన హోలీ వేడుకలలో పాల్గొనేందుకు ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అక్కడికి వచ్చారు.
ఇస్కాన్ టెంపుల్‌లో జనం భారీగా ఉన్నట్టు వీడియోలో చూడవచ్చు. ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ జనాల గుంపుపై కలర్ గన్‌తో రంగులు విసురుతూ.. చాలా సరదాగా గడిపారు. లక్సన్ మెడలో పూల దండను ధరించి, పూర్తి దేశీ స్టైల్‌లో భుజంపై గమ్చా ధరించారు. దానిపై హ్యాపీ హోలీ అని వ్రాసి ఉంది.