Video : 2026 సంవత్సరానికి ఘ‌నంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

ఈరోజు 2025 చివరి రోజు. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది.

By -  Medi Samrat
Published on : 31 Dec 2025 6:02 PM IST

Video : 2026 సంవత్సరానికి ఘ‌నంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

ఈరోజు 2025 చివరి రోజు. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. దేశం కొత్త సంవత్సరాన్ని స్వాగతించబోతోంది. ఒకవైపు ప్రపంచం క్యాలెండర్ పేజీని తిరగేసేందుకు సిద్ధమవుతుంటే మరోవైపు న్యూజిలాండ్‌లో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో బాణాసంచా కాల్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. వర్షంతో తడిసిన వాతావరణం మధ్య 2026కి స్వాగతం పలికారు.

డౌన్‌టౌన్‌లోని దేశంలోనే ఎత్తైన భవనం అయిన స్కై టవర్ నుండి అద్భుతమైన బాణసంచా కాల్చారు. ఈ ఐదు నిమిషాల ప్రదర్శనలో 240 మీటర్ల ఎత్తైన స్కై టవర్‌లోని వివిధ అంతస్తుల నుండి 3500 రకాల బాణసంచా కాల్చారు. వర్షం పడే అవకాశం ఉన్నందున న్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్‌లో కమ్యూనిటీ ఈవెంట్‌లు రద్దు చేయబడ్డాయి.

దక్షిణ పసిఫిక్‌లోని దేశాలు 2025కి ప్రపంచంలోనే మొదట వీడ్కోలు పలుకుతాయి. కిరిబాటిలోని కిరిటిమతి ద్వీపం.. ప్రపంచంలోనే నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించిన తొలి దేశం ఇదే. కిరిబాతిని కిరిబాస్ అని కూడా అంటారు. ఇది అనేక అటోల్స్‌తో కూడిన ద్వీప సమూహం. దీని పొడవు దాదాపు 4,000 కిలోమీటర్లు. ఇక్కడ నూతన సంవత్సరం భారతదేశానికి 8 గంటల 30 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది.

Next Story