డిసెంబర్ 31, 2024న అర్ధరాత్రి దాటడంతో న్యూజిలాండ్ వాసులు అద్భుతమైన వేడుకలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. 2025లోకి ప్రవేశించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా న్యూజిలాండ్ అవతరించింది. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో, ఐకానిక్ స్కై టవర్ ఈ ఉత్సవాలకు కేంద్రంగా ఉంది. అద్భుతమైన బాణసంచా ప్రదర్శనతో అక్కడి వారిని అబ్బురపరిచింది. వేలాది మంది అక్కడ గుమిగూడారు.
న్యూ ఇయర్ వేడుకలు ఆక్లాండ్ లో మాత్రమే కాదు వెల్లింగ్టన్‌లో కూడా పెద్ద ఎత్తున సాగాయి. క్రైస్ట్‌చర్చ్, క్వీన్స్‌టౌన్ కూడా ఈ వేడుకలలో భాగమయ్యాయి. పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగమవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు న్యూజిలాండ్‌కు తరలివచ్చారు.