కొత్త రూల్.. మహిళలు నిఖాబ్ ధరించి డ్రైవింగ్ చేస్తే జరిమానా.!

కువైట్‌లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం మహిళలకు పలు ఆంక్షలు విధించారు.

By Medi Samrat
Published on : 19 March 2025 8:15 PM IST

కొత్త రూల్.. మహిళలు నిఖాబ్ ధరించి డ్రైవింగ్ చేస్తే జరిమానా.!

కువైట్‌లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం మహిళలకు పలు ఆంక్షలు విధించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిఖాబ్ లేదా బుర్ఖా ధరించడంపై నిషేధాన్ని ఉల్లంఘించిన మహిళలకు 30 నుండి 50 కువైట్ దినార్ల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నేరానికి ఎటువంటి జైలు శిక్ష విధించరు.

నిఖాబ్ ధరించడం వల్ల డ్రైవర్ దృష్టి, ఏకాగ్రతకు ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుంది కాబట్టి, రోడ్డు భద్రతను పెంచడానికి ఈ చట్టం రూపొందించామని మంత్రిత్వ శాఖ వివరించింది. నిఖాబ్ నిఘా కెమెరాలు డ్రైవర్లను గుర్తించడం కష్టతరం చేస్తుందని, దీనివల్ల భద్రతా ప్రమాదాలు పెరుగుతాయని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కువైట్ లో మహిళా పోలీసు అధికారులు అందుబాటులోకి రావడంతో, మహిళా డ్రైవర్ల గుర్తింపును ధృవీకరించడం ఒక సరళమైన ప్రక్రియగా మారింది.

Next Story