అప్పుడే పుట్టిన పసికందు ఫోటో తీశారు.. చివరికి?

New Born Baby. అప్పుడే పుట్టిన పసికందు ఫోటో తీశారు. చివరికి ఆ బేబీ కంటి చూపు పోగొట్టుకోవలసి వచ్చింది.

By Medi Samrat
Published on : 1 Jan 2021 12:47 PM IST

new born baby photos

ఈ మధ్యకాలంలో అప్పుడే పుట్టిన పసిపిల్లలకు ఫోటోలు తీసి వాటిని సెల్లులో వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. తమకు పాప లేక బాబు పుట్టాడని తమ బంధువులకు, స్నేహితులకు తెలియజేయడానికి వారిని ఫోటోలు తీసి పంపుతుంటారు. ఈ విధంగా బంధువులకు ఫోటోలు పంపించడం వరకు అయితే ఓకే. కానీ ఆ పసికందుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఎంతోమంది దృష్టి వారి పై పడుతుంది. అయితే చిన్నపిల్లల ఫోటోలను ఇలా చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

పసిపిల్లలను చూడగానే ఎవ్వరికైనా ముద్దొస్తుంది. అలా వారిని చూసినప్పుడు ఎవరికైనా ఫోటో తీయాలని అనిపిస్తుంది.ఆ విధంగా ఫోటోలు తీసే సమయంలో కెమెరాలకు ఫ్లాష్ లైట్ లను కచ్చితంగా ఆఫ్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ ఆఫ్లాష్ పసిపిల్లల కంటిలో పడితే వారికి కళ్ళు పోయే ప్రమాదం ఉందని, అందువల్లే పసిపిల్లలకు ఫోటోలు తీయకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇటీవలే చైనాలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. బాబుని చూడటానికి వచ్చిన బంధువులు, ఆ బాబు ఎంతో ముద్దు రావడంతో బాబు దగ్గరగా వెళ్లి ఫ్లాష్ లైట్ ఆఫ్ చేయకుండా ఫోటో తీశాడు. ఆ ఫ్లాష్ లైట్ వల్ల బాబు కుడికన్ను మసకబారింది. ఫోటో తీసినప్పటి నుంచి ఏడవడం మొదలు పెట్టాడు. అలా ఏడవడం వల్ల బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. బాబు కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని, తన జీవితంలో చూపు తిరిగి రాదని డాక్టర్లు తెలియజేశారు. ఈ విషయం విన్న తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోయారు. దాదాపు ఐదు సంవత్సరాలు దాటే వరకు పిల్లలకు నేరుగా ఫోటోలను తీయకూడదని, తీస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు.


Next Story