ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్‌బుక్' మాతృసంస్థ పేరును 'మెటా'గా మార్చారు దాని యాజమాన్యం. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ వీడియో రూపంలో తెలిపారు. అయితే ఆయన తన ఇంట్లోని లివింగ్ రూమ్‌లో ఈ వీడియో షూట్ చేసినట్లు తెలిసింది. అయితే సోషల్ మీడియా యూజర్ల గురించి తెలిసిందే కదా. వీడియోలో అతను చెప్పే దానికి, అందులో వింతగా, భిన్నంగా కనిపించి ఓ సాస్ బాటిల్‌ను హైలెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. జుకర్‌బర్గ్ సందేశం చెబుతున్న రూమ్‌లో ఓ బుక్‌షెల్ప్ ఉంది. అందులో పుస్తకాలు పెట్టాడు. వాటికి చివరన బీబీక్యూ సాస్ బాటిల్‌ను ఉంచారు. దీనిపైనే నెటిజన్ల కన్ను పడింది. ఇంకేముంది.. అది అక్కడ ఎందుకు పెట్టారు, అసలు అది అక్కడ ఎందుకు ఉంది అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మామూలుగానైతే పుస్తకాలు పడిపోకుండా బరువైన వస్తువులను పెడుతుంటాం. పుస్తకాలు పడిపోకుండా ప్రత్యేక్ స్టాండ్‌లు కూడా ఉంటాయి. బరువైన వస్తువులను చాలా మంది తమ ఇంట్లో పుస్తకాలకు బుక్ ఎండ్స్‌గా వాడుతుంటారు. సాస్ బాటిల్‌ను జూకర్‌బర్గ్ బుక్ ఎండ్‌లా వాడారని కొంతమంది నెటిజన్లు అంటుంటే.. మరికొంత మంది మాత్రం ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ను కనుగొన్న జూకర్.. బుక్‌ఎండ్ కూడా కొనుక్కోలేరా, సామాన్య ప్రజలు వాడే బ్రాండ్లనే జుకర్ వాడతారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది యాడ్స్ విషయంలో ఫేస్‌బుక్ పనితీరుపై విమర్శించారు. ఫేస్‌బుక్ పేరు మార్పు కంటే.. సాస్ బాటిల్ అక్కడ పెట్టడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరీ ఈ విషయంపై జుకర్‌బర్గ్ స్పందిస్తారో చూడాలి.!