నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'జెన్ జీ' నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య‌

నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం తర్వాత చెలరేగిన Gen-Z ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.

By Medi Samrat
Published on : 8 Sept 2025 9:00 PM IST

నేపాల్‌లో హింసాత్మకంగా మారిన జెన్ జీ నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య‌

నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం తర్వాత చెలరేగిన Gen-Z ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది. హిమాలయన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మృతులలో 16 మంది ఖాట్మండు, ఇద్దరు ఇటాహరీకి చెందినవారు. ఈ ప్రదర్శనలో 200 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది, జర్నలిస్టులు ఉన్నారు.

మీడియా కథనాల ప్రకారం.. ఈ సమయంలో నేపాల్‌లో రాజకీయ గందరగోళం తీవ్రమైంది. ప్రధానమంత్రి నివాసంలో అత్యవసర కేబినెట్ సమావేశాన్ని పిలిచారు. నేపాల్ హోం మంత్రి రమేష్ లాల్కర్ నైతిక కారణాలతో రాజీనామాకు ప్రతిపాదించారు. మరోవైపు విద్యార్థులు వీధుల్లోకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు.

నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత నిరసనలకు దిగింది. సోమవారం నాడు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించారని స్థానిక మీడియా నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి సోమవారం ఖాట్మండులోని మైతిఘర్‌లో నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు. అయితే నేపాల్ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి సోషల్ మీడియా సైట్‌లపై నిషేధం విధించాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే ఉన్నారు.

Next Story