18న భూమి మీద‌కు సునీతా విలియమ్స్‌.. ఎక్క‌డ దిగ‌నున్నారంటే..?

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.

By Medi Samrat
Published on : 17 March 2025 8:46 AM IST

18న భూమి మీద‌కు సునీతా విలియమ్స్‌.. ఎక్క‌డ దిగ‌నున్నారంటే..?

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను మార్చి 19న విజయవంతంగా భూమికి తీసుకురానున్నారు. వీరిద్దరి రిటర్న్‌కి సంబంధించి నాసా పెద్ద అప్‌డేట్ ఇచ్చింది.

ఇద్దరు వ్యోమగాములు మార్చి 18 (మంగళవారం)న భూమికి తిరిగి వస్తారని నాసా ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. వారిద్దరిని ఫ్లోరిడా తీరంలో దించాల‌ని NASA భావిస్తోంది.

NASA ఈ తిరుగు ప్ర‌యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. హాచ్‌ను మూసివేయడానికి డ్రాగన్ అంతరిక్ష నౌక సిద్ధమయ్యే క్ర‌మంలో ప్రత్యక్ష ప్రసార కవరేజీ ప్రారంభమవుతుంది. నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మోస్ (రష్యా) వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా డ్రాగన్ క్యాప్సూల్‌లో తిరిగి వస్తారు.

కాగా.. శుక్రవారం (మార్చి 14), SpaceX క్రూ-10 మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిష‌న్‌కు.. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ని ఫాల్కన్-9 రాకెట్ నుంచి ప్రయోగించారు.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి చివరి నాటికి భూమికి తిరిగి రావాల్సి ఉండటం గమనార్హం, అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారిని త్వరగా తిరిగి తీసుకురావాలని ఎలోన్ మస్క్‌ను కోరడంతో మిషన్ వేగవంతమైంది.

గతేడాది జూన్‌ 5న సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారు కేవలం ఒక వారం తర్వాత భూమికి తిరిగి రావాల్సి ఉంది, కానీ బోయింగ్ స్టార్‌లైనర్‌లో లోపం కారణంగా.. వారిద్దరూ అక్కడ చిక్కుకున్నారు. ఇద్దరూ 9 నెలలకు పైగా అక్కడే ఇరుక్కుపోయారు. అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ అనేక ముఖ్యమైన పరిశోధనా ప్రయోగాలు చేశారు. ఆమె 900 గంటలకు పైగా పరిశోధనలో గడిపారు.

Next Story