టిక్‌టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్.. కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తానని చెప్పి

టిక్‌టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న మెక్సికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌ను కాల్చి చంపారు.

By Medi Samrat
Published on : 15 May 2025 8:09 PM IST

టిక్‌టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్.. కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తానని చెప్పి

టిక్‌టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న మెక్సికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌ను కాల్చి చంపారు. మెక్సికోలోని జాలిస్కోలోని గ్వాడలజారా నగరంలోని బ్యూటీ సెలూన్‌లోకి బహుమతిని అందించే నెపంతో ప్రవేశించిన వ్యక్తి, 23 ఏళ్ల వలేరియా మార్క్వెజ్‌ అనే యువతిపై కాల్పులు జరిపాడు.

ఈ సంఘటన జరిగినప్పుడు వలేరియా మార్క్వెజ్‌ తన 'బ్లోసమ్ ది బ్యూటీ లాంజ్ సెలూన్' నుండి లైవ్ స్ట్రీమ్ లో ఉంది. ఫుటేజ్‌లో, టిక్‌టాకర్ ఒక టేబుల్ వద్ద కూర్చుని, స్టఫ్డ్ బొమ్మను పట్టుకుని, తన ఫాలోవర్స్ తో మాట్లాడుతున్నట్లు కనిపించింది. సంఘటనకు కొన్ని సెకన్ల ముందు ఆమె "వారు వస్తున్నారు" అని చెప్పడం వినిపించింది. క్షణాల తర్వాత, మార్క్వెజ్ తన పక్కటెముకలను పట్టుకుని టేబుల్‌పై కూలిపోయింది.

నివేదికల ప్రకారం, మార్క్వెజ్ ఇంతకు ముందు లైవ్ స్ట్రీమ్‌లో తాను లేనప్పుడు ఎవరో సెలూన్‌కి ఖరీదైన బహుమతితో వచ్చారని చెప్పింది. మార్క్వెజ్ ఛాతీ, తలపైకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక తెలిపింది. తుపాకీతో దాడి చేసిన వ్యక్తి మోటార్ బైక్ పై వచ్చి ఆమెకు బహుమతి ఇస్తున్నట్లు నటించాడని నివేదిక పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో దాదాపు 2,00,000 మంది ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు.

Next Story