వణికింది.. భయపడి బయటకు వచ్చేసిన అధ్యక్షురాలు

మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.

By -  అంజి
Published on : 3 Jan 2026 4:10 PM IST

Mexico President, earthquake, Mexico, international news

వణికింది.. భయపడి బయటకు వచ్చేసిన అధ్యక్షురాలు

మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్‌మాక్రోస్‌కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఏకంగా 33 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంపం సంభవించిన సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే ఆపేశారు. అధ్యక్షురాలితోపాటు సిబ్బంది, మీడియా అంతా అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చేశారు.

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం అకాపుల్కో సమీపంలో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు ఉత్తర దిశగా సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో సిటీ వరకు వ్యాపించింది.

Next Story