అక్కడ మనుషుల్ని తిని.. పందుల్ని వదిలేశారు..!

Mexican Archaeologists Find tale of Brutal Killings Show People Eating Pigs. మనుషులు జంతువులను వదిలిపెట్టి మనిషిని తినడం అసాధారణ విషయం.ఇలాంటి సంఘటన మెక్సికో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంథ్రపాలజీ అండ్‌ హిస్టరీ ఒక నివేదికను వెల్లడించింది.

By Medi Samrat  Published on  24 Jan 2021 2:52 AM GMT
Mexican Archaeologists Find tale of Brutal Killings

సాధారణంగా మనుషులు జంతువులను వేటాడి తినడం గురించి మనం వినే ఉంటాం. కానీ మనుషులు జంతువులను వదిలిపెట్టి మనిషిని తినడం అసాధారణ విషయం. ఇలాంటి సంఘటన గురించి కూడా ఇదివరకు ఎప్పుడు వినలేదు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఒక భయంకరమైన నిజాన్ని మెక్సికో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంథ్రపాలజీ అండ్‌ హిస్టరీ ఒక నివేదికను వెల్లడించింది. ఇందులో...


సుమారు 1500 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఓ స్పానిష్ విజేత తన సైన్యంతో కలిసి బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లలని చంపి తిన్నట్టు తాజా నివేదికలో బయటపడింది. ఈ నివేదికలో వెలువడిన మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ సైన్యం మనుషులను తిని పందులను వదిలేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. 1520 లో టెకోయిక్‌ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను 'జుల్టెపెక్' అని కూడా పిలుస్తారు.

ఈ ఘటనలో బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు పదిమందికి 45 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం.వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని తెలిసి. ఇక వీరిని బంధించిన విషయం హెర్నాన్ కోర్టెస్‌కు తెలుపుగా అతను వారిని చంపి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించడంతో, వారు ఆ సైన్యంపై విరుచుకుపడి వారిని చంపి తిన్నట్లు ఈ నివేదికలో వెల్లడించారు. అయితే వారు ఆహారం కోసం తమ వెంట పందుల్ని తీసుకువెళ్లగా ఆ పందుల్ని వదిలి మనుషుల్ని తిన్న ఆనవాలు ఈ తవ్వకాలలో బయట పడ్డాయనిమెక్సికో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంథ్రపాలజీ అండ్‌ హిస్టరీ ఒక నివేదికను వెల్లడించింది.


Next Story