దారుణం.. మానసిక వికలాంగురాలైన 13 ఏళ్ల బాలికపై గూడ్స్ రైలులో అత్యాచారం

పాకిస్థాన్‌లో మైనారిటీలకు భద్రత లేదు. వారిపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయి.

By Medi Samrat
Published on : 27 March 2025 7:39 AM IST

దారుణం.. మానసిక వికలాంగురాలైన 13 ఏళ్ల బాలికపై గూడ్స్ రైలులో అత్యాచారం

పాకిస్థాన్‌లో మైనారిటీలకు భద్రత లేదు. వారిపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి మానసిక వికలాంగురాలైన 13 ఏళ్ల క్రైస్తవ బాలికను కిడ్నాప్ చేసి గూడ్స్ రైలులో అత్యాచారం చేశాడు. ఈ వారం ప్రారంభంలో లాహోర్‌కు 170 కిలోమీటర్ల దూరంలోని లాలా మూసాలో ఈ ఘటన జరిగింది.

పోలీసు అధికారి షబ్బీర్ హుస్సేన్ చీమా తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను నిందితుడు రహీల్ బట్ ఇంటి బయట నుంచి అపహరించాడు. ఆగి ఉన్న గూడ్స్ రైలులోని క్యాబిన్‌లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

కూతురిపై జ‌రిగిన అఘాయిత్యం గురించి తెలిసిన వెంట‌నే ఆమె తల్లికి గుండెపోటు వ‌చ్చింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ప‌ట్టుకుని విచారణ జరిపి న్యాయం చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌కు విజ్ఞప్తి చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు.

Next Story