కూరలకు తాళింపు వేసే 'ఆవాల'తో విమానం ఇంధనం.. అద్బుతం సృష్టించిన భారతీయుడు.!

Manufacture of aviation fuel with mustard oil. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో.. విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు

By అంజి  Published on  19 Oct 2021 5:42 AM GMT
కూరలకు తాళింపు వేసే ఆవాలతో విమానం ఇంధనం.. అద్బుతం సృష్టించిన భారతీయుడు.!

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో.. విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు పెనుభారంగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా విమాన సంస్థలు.. ఇంధనం కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు విమానాల ఇంధనం ఖర్చును తగ్గించేందుకు భారతీయుడు ఊరట కలిగించే విషయాన్ని తెలిపాడు. భారతీయ శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది, అతని పరిశోధక బృందం... ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని పేర్కొంది.

బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనె ద్వారా ఈ ఇంధనం తయారు చేయవచ్చని పరిశోధులకు చెబుతున్నారు. దీని వల్ల ఇంధన ఖర్చులు తక్కువ కావడంతో పాటు, కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని తెలిసింది. తాజాగా పునీత్‌ ద్వివేది పరిశోధన వివరాలు జీసీబీ బయో ఎనర్జీ జర్నల్‌లో ప్రచురించబడింది. సౌత్ఈస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రిన్యూవబుల్స్‌ ఫ్రమ్‌ కేరినాటా ప్రాజెక్టులో పునీత్‌ ద్వివేది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ చేపట్టింది. గత 4 సంవత్సరాలుగా అమెరికాలోని కేరినాటా రకం ఆవాలపై పరిశోధనలు సాగుతున్నాయి. వాటిని ఎలా పెంచాలి, వాటి నుంచి నూనె ఎలా సేకరించాలన్న దానిపై పరిధోనలు చేస్తున్నారు.

చమురు ఇంధనంతో పోలిస్తే... ఆవాల మొక్కలతో లీటర్‌ ఇంధనం తయారు చేయడానికి 0.12 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆవాలతో తయారు చేసే ఇంధనం ద్వారా ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చని జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పునీత్‌ ద్వివేదీ తెలిపారు. అమెరికాలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 2.5 శాతం విమానయాన రంగానిదే. అయితే దీన్ని తగ్గించేందుకు.. తమకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే ఆవాలు ఇంధనాన్ని తయారు చేస్తామని పునీత్ ద్వివేది తెలిపారు.

Next Story