ఇథియోపియా సరిహద్దు నుండి వెనక్కి వచ్చేసిన ఇండిగో విమానం

ఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6E33) గాలిలోనే అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుంది.

By -  Medi Samrat
Published on : 9 March 2026 5:17 PM IST

ఇథియోపియా సరిహద్దు నుండి వెనక్కి వచ్చేసిన ఇండిగో విమానం

ఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6E33) గాలిలోనే అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుంది. విమానం ఇథియోపియా సరిహద్దు సమీపంలోని గగనతలానికి చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా వెనక్కి మళ్లింది. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలోనే వెనక్కి తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి ప్రవేశించింది. విమానం మధ్యలోనే ఎందుకు వెనక్కి మళ్లింది అనే దానికి సంబంధించి స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, విమానం ఇథియోపియా సరిహద్దుకు సమీపంలోని గగనతలానికి దగ్గరగా చేరుకుంది, అకస్మాత్తుగా యు టర్న్ తీసుకుంది. తరువాత విమానం భారత గగనతలంలోకి తిరిగి ప్రవేశించింది.

Next Story