అడవిలో దారి త‌ప్పిపోయాడు.. 30 రోజులు ఏం తిని బ‌తికాడంటే..

అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. రాబర్ట్ స్కాక్ అనే వ్యక్తి తన కుక్కతోపాటు పరిమిత సామాగ్రితో వాషింగ్టన్‌లోని నార్త్ క్యాస్కేడ్ నేషనల్ పార్క్ సంద‌ర్శ‌న‌కు వెళ్లాడు

By Medi Samrat  Published on  29 Oct 2024 10:54 AM GMT
అడవిలో దారి త‌ప్పిపోయాడు.. 30 రోజులు ఏం తిని బ‌తికాడంటే..

అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. రాబర్ట్ స్కాక్ అనే వ్యక్తి తన కుక్కతోపాటు పరిమిత సామాగ్రితో వాషింగ్టన్‌లోని నార్త్ క్యాస్కేడ్ నేషనల్ పార్క్ సంద‌ర్శ‌న‌కు వెళ్లాడు. ఆ సమయంలో అతడు దారి తప్పిపోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ మొద‌లయ్యింది. అతడు చాలా రోజులుగా కనిపించకపోవడంతో అతని కుటుంబం, స్నేహితులు, అధికారులు అతని గురించి ఆందోళన చెందారు.

స్కాక్ కోసం చాలా రోజులు వెతికిన తర్వాత.. పసిఫిక్ నార్త్‌వెస్ట్ ట్రైల్ అసోసియేషన్ బృందం అతన్ని అడవుల అంచున సజీవంగా గుర్తించింది. ఆ వ్యక్తి నెల రోజులుగా ఏమీ తినలేదని.. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవని ఆ బృందం పేర్కొంది. అతని ద‌గ్గ‌ర‌ ఫోన్ కూడా లేదు. పసిఫిక్ నార్త్‌వెస్ట్ అసోసియేషన్ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ.. రాబర్ట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సజీవంగా ఉన్నాడు.. ఇది నిజంగా గర్వించదగిన విషయం అని పేర్కొంది.

స్కాక్‌ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులు మాత్రమే ఇంట్రావీనస్ ఫీడింగ్‌లను స్వీకరించారు. రాబర్ట్ కొద్దిగా కోలుకున్న త‌ర్వాత అతడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతడు మరణానికి ఎంత దగ్గరగా వెళ్లాడో అతని మాటలు వెల్లడించాయి.

"నేను పాదచారి కాదు.. బ్యాక్‌ప్యాక్ ధరించి కొద్ది రోజుల ప్రయాణానికి వెళ్లాను. నాకు చేపలు పట్టడం తెలియదు. వీలైనంత త్వరగా కోర్సు పూర్తి చేసి ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నాను. అందుకే నాకు చొక్కా లేదు. ఒక జత షార్ట్స్ ఉన్నాయి. నా దగ్గర (నా కుక్క) ఫ్రెడ్డీ ఉంది. 30 రోజులు తను పుట్టగొడుగులు, బెర్రీలు, నీరు మాత్రమే తీసుకున్నట్లు చెప్పాడు. రోజంతా అవే తిన్నట్లు పేర్కొన్నాడు. పుట్టగొడుగులు రుచి ఆశ్చర్యకరంగా ఉంద‌ని "నేను రోజంతా అదే తిన్నానని వెల్ల‌డించాడు.

Next Story