టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By - Knakam Karthik |
టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఆయన విధించిన భారీ సుంకాలను కోర్టు కొట్టివేసింది. అధ్యక్షుడు ట్రంప్ గతేడాది ఏప్రిల్‌లో "లిబరేషన్ డే" పేరుతో వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, ఆ అధికారం కేవలం కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్)కు మాత్రమే ఉందని 6-3 మెజారిటీతో కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి, వ్యాపార సంస్థల నుంచి టారిఫ్ రూపంలో వసూలు చేసిన సుమారు $180 బిలియన్ల (రూ. 15 లక్షల కోట్లకు పైగా) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని (Refund) కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారం తగ్గనుంది. తీర్పు వెలువడిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లాయి.
ట్రంప్ స్పందన:
ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిని ఒక "అవమానం" (Disgrace) గా అభివర్ణించిన ఆయన, తమ వద్ద 'ప్లాన్ బి' సిద్ధంగా ఉందని, జాతీయ భద్రత పేరుతో మళ్లీ సుంకాలు విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.