Earthquake : మ‌రోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం

అఫ్గానిస్థాన్‌లో మ‌రోసారి భూమి కంపించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 5.49 గంట‌ల‌కు కాబూల్‌లో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2023 3:15 AM GMT
Earthquake, Afghanistan

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

అఫ్గానిస్థాన్‌లో మ‌రోసారి భూమి కంపించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 5.49 గంట‌ల‌కు కాబూల్‌లో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. రిక్ట‌ర్ స్కేల్ పై దీని తీవ్ర‌త 4.3గా న‌మోదు అయిన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కాబూల్‌కు తూర్పున 85 కిలోమీట‌ర్ల దూరంలో, భూమికి 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా.. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఈ నెల 22న 6.8 తీవ్రతతో అప్గానిస్థాన్‌లో భూమి కంపించింది. దీని ప్ర‌భావం ఎక్కువ‌గా పాకిస్థాన్‌లో క‌నిపించింది. దాదాపు 13 మంది మ‌ర‌ణించ‌గా, దాదాపు 250 మంది గాయపడ్డారు.భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతం కాగా, దాని లోతు 180 కిలోమీటర్లు అని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.

పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాట్, గుజ్రాన్‌వాలా, గుజరాత్, సియాల్‌కోట్, కోట్ మోమిన్, మద్ రంఝా, చక్వాల్, కోహట్ మరియు గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో దీని తీవ్ర‌త కంపించింది.

Next Story