పాక్‌ రక్షణ మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. మదర్సా విద్యార్థులను అలా వాడుతారట..!

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మదర్సాలలో ఉండే విద్యార్థులను దేశం రెండవ రక్షణ శ్రేణిగా అభివర్ణించడం ఆందోళన కలిగిస్తూ ఉంది.

By Medi Samrat
Published on : 10 May 2025 5:49 PM IST

పాక్‌ రక్షణ మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. మదర్సా విద్యార్థులను అలా వాడుతారట..!

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మదర్సాలలో ఉండే విద్యార్థులను దేశం రెండవ రక్షణ శ్రేణిగా అభివర్ణించడం ఆందోళన కలిగిస్తూ ఉంది. భారతదేశంతో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. సరిహద్దుల్లో శత్రుత్వాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన పార్లమెంటు సమావేశంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మదర్సాలు లేదా మదర్సా విద్యార్థుల విషయానికొస్తే, వారు మన రెండవ రక్షణ శ్రేణి అనడంలో సందేహం లేదు. సమయం వచ్చినప్పుడు, అక్కడ చదువుతున్న యువకులను అవసరమైన విధంగా 100 శాతం ఉపయోగించుకుంటాము" అని చెప్పారు.

వరుసగా రెండవ రోజు, పాకిస్తాన్ తన ఆపరేషన్ 'బున్యాన్-ఉన్-మర్సూస్' కింద జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అంతటా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులను ప్రారంభించింది. పంజాబ్‌లోని వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న హై-స్పీడ్ క్షిపణులను భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ శ్రీనగర్, అవంతిపూర్, ఉధంపూర్‌లోని వైమానిక స్థావరాలలో ఉన్న ఆసుపత్రులు, పాఠశాలలపై కూడా డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి ఆయుధాలను ఉపయోగించి పాకిస్థాన్ దాడి చేసింది. అటువంటి దాడులన్నింటినీ భారత దళాలు తిప్పికొట్టాయి.

Next Story