ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. 7 నిమిషాల్లోనే దోచేశారు..!

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియాల్లో ఒకటైన లౌవ్రే మ్యూజియంలో దొంగతనం జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

By -  Medi Samrat
Published on : 19 Oct 2025 6:10 PM IST

ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. 7 నిమిషాల్లోనే దోచేశారు..!

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియాల్లో ఒకటైన లౌవ్రే మ్యూజియంలో దొంగతనం జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కొందరు దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించి విలువైన నగలను ఎత్తుకెళ్లారు. చోరీ ఘటన తర్వాత మ్యూజియాన్ని ఒకరోజు పాటు మూసివేశారు. ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ మంత్రి రచిదా దాతీ దొంగతనం గురించి స‌మాచారం ఇచ్చారు. ఈ రోజు ఉదయం లౌవ్రే మ్యూజియం తెరిచే సమయంలో దానిలో దోపిడీ జరిగిందని ఆయన ఎక్స్‌లోని పోస్ట్‌లో తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నేను మ్యూజియం సిబ్బంది, పోలీసులతో సంఘటనా స్థలంలో ఉన్నాను. మ్యూజియం తెరిచే సమయంలో చోరీ జరిగిందని చెప్పారు. దీంతో మ్యూజియాన్ని ఒకరోజు మూసేయాల్సి వచ్చింది.

సమాచారం ప్రకారం.. కొంతమంది వ్యక్తులు డిస్క్ కట్టర్‌లతో, ఆయుధాలతో స్కూటర్‌పై ప్యారిస్‌లోని పటిష్ట భద్రత కలిగిన లౌవ్రే మ్యూజియంకు చేరుకున్నారు. కేవలం ఏడు నిమిషాల్లోనే చోరీకి పాల్పడి లౌవ్రే మ్యూజియంలోని నెపోలియన్ కలెక్షన్ నుంచి విలువైన ఆభరణాలతో పరారయ్యారు. ఈ దోపిడీ ఉదయం 9.30 మరియు 9.40 గంటల మధ్య జరిగిందని వార్తా సంస్థ AFP నివేదించింది. ఫ్రెంచ్ అంతర్గత మంత్రి లారెంట్ నునెజ్ కేవలం ఏడు నిమిషాలలోనే దోచుకెళ్లార‌ని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు చెర్రీ పికర్స్ (ఒక రకమైన హైడ్రాలిక్ నిచ్చెన)తో బయటి నుంచి చొరబడి విలువైన ఆభరణాలను దొంగిలించారని మంత్రిని ఉటంకిస్తూ ఫ్రెంచ్ వార్తాపత్రిక లే పారిసియన్ పేర్కొంది. ఈ చోరీ ఘటన ఏడు నిమిషాల పాటు జ‌రిగింద‌ని వెల్ల‌డించారు.

ముగ్గురు-నలుగురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని, వారి దృష్టి గ్యాలరీ డి అపోలోన్ (అపోలోస్ గ్యాలరీ)పైనే ఉందని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. గ్లాస్ "డిస్క్ కట్టర్‌తో" కత్తిరించబడిందని ఆయ‌న‌ వివరించారు.

Next Story