జూ కీపర్‌ను చంపి పీక్కుతిన్న సింహాలు

బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూలో 20 ఏళ్లుగా సింహాల కేర్‌కేట‌ర్‌గా ప‌ని చేస్తున్న వ్య‌క్తిపై దాడి చేసి సింహాలు పీక్కుతిన్నాయి.

By -  Medi Samrat
Published on : 11 Sept 2025 5:21 PM IST

జూ కీపర్‌ను చంపి పీక్కుతిన్న సింహాలు

బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూలో 20 ఏళ్లుగా సింహాల కేర్‌కేట‌ర్‌గా ప‌ని చేస్తున్న వ్య‌క్తిపై దాడి చేసి సింహాలు పీక్కుతిన్నాయి. వాహ‌నాల హార‌న్లు కొడుతూ, గ‌ట్టి గ‌ట్టిగా అరిచినా కూడా అతడిని వదిలిపెట్టలేదు. జియన్ రంగ్‌ఖరాసమీ అనే వ్యక్తి ఇరవై ఏళ్లుగా బ్యాంకాక్‌ సఫారీ వరల్డ్‌లో పని చేస్తున్నాడు. ఓపెన్‌ ఎయిర్‌ జూలో కొంతకాలంగా సింహాల కేర్‌టేకర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం సింహాల ఎన్‌క్లోజర్‌లో ఉండగా ఆయన తన వాహనం నుంచి కిందకు దిగారు.

అంతే సింహాలు ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడ్డాయి. కొందరు పర్యాటకులు వాహనాల హారన్‌లు కొడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా దారిలోనే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు.

Next Story