శవమై కనిపించిన ఆస్కార్ అవార్డు గ్రహీత..

'బోనీ అండ్ క్లైడ్' సినిమాకు గాను ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు జీన్ హాక్‌మాన్ మరణించారని అధికారులు తెలిపారు.

By Medi Samrat  Published on  27 Feb 2025 8:40 PM IST
శవమై కనిపించిన ఆస్కార్ అవార్డు గ్రహీత..

'బోనీ అండ్ క్లైడ్' సినిమాకు గాను ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు జీన్ హాక్‌మాన్ మరణించారని అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం న్యూ మెక్సికోలోని వారి ఇంట్లో అతని భార్య బెట్సీ, కుక్క కూడా చనిపోయారని నివేదికలు తెలిపాయి.

శాంటా ఫే కౌంటీ షెరీఫ్ అడాన్ మెన్డోజా మరణాన్ని ధృవీకరించారు. కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. "జీన్ హాక్‌మాన్, అతని భార్య ఇద్దరూ బుధవారం మధ్యాహ్నం సన్‌సెట్ ట్రైల్‌లోని వారి నివాసంలో చనిపోయారని మేము నిర్ధారిస్తున్నాము. ఈ మరణం వెనుక కుట్ర ఏదైనా ఉందేమోనని తాము నమ్మడం లేదు" అని పోలీసులు తెలిపారు.

1930లో జన్మించిన జీన్ హాక్ మాన్ 100కు పైగా పాత్రలు పోషించారు. రెండు ఆస్కార్‌లను గెలుచుకున్నారు. ది ఫ్రెంచ్ కనెక్షన్‌లో జిమ్మీ పొపాయ్ డోయల్ పాత్రకు ఉత్తమ నటుడు, అన్‌ఫర్గివెన్‌ సినిమాలో లిటిల్ బిల్ డాగెట్ పాత్ర పోషించినందుకు ఉత్తమ సహాయ నటుడుగా ఆస్కార్ ను గెలుచుకున్నారు.

Next Story