ఓటమిని ఒప్పుకున్న రిషి సునాక్

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఓటమి పాలయ్యారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఘోరమైన ఎన్నికల ఫలితాలను సొంతం చేసుకుంది.

By Medi Samrat  Published on  5 July 2024 9:15 AM GMT
ఓటమిని ఒప్పుకున్న రిషి సునాక్

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఓటమి పాలయ్యారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఘోరమైన ఎన్నికల ఫలితాలను సొంతం చేసుకుంది. రిషి సునాక్ కూడా ఓటమిని అంగీకరించారు. చారిత్రాత్మక UK ఎన్నికలలో కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. UK పార్లమెంట్‌లో మెజారిటీని సొంతం చేసుకోడానికి లేబర్ పార్టీ తగినన్ని సీట్లు గెలుచుకుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అధికారిక ఫలితాలు చూపించాయి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీకి దాదాపు 160 సీట్ల మెజారిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ కొనసాగుతుండగా.. శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి 650 స్థానాలకు గానూ 326 స్థానాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది.

రిషి సునాక్ 23,059 ఓట్ల ఆధిక్యంతో ఉత్తర ఇంగ్లండ్‌లోని రిచ్‌మండ్ అండ్ నార్తలెర్టన్ సీటును సునాయాసంగా నిలబెట్టుకున్నారు. అయితే జాతీయ స్థాయిలో తన పార్టీని గెలిపించడంలో విఫలమయ్యారు. "ఈ సార్వత్రిక ఎన్నికలలో లేబర్ పార్టీ గెలిచింది. ఆ పార్టీ సాధించిన విజయానికి అభినందనలు" అని సునక్ తెలిపారు.

Next Story