వెబ్ సిరీస్ చూసినందుకు చంపేస్తారా

Kim Jong Un severely punishes those who watch the web series 'Squid Game'. ఉత్తర కొరియా నియంత కిమ్ జాన్ ఉంగ్ వేసే శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు విధిస్తూ ఉంటారు.

By అంజి  Published on  25 Nov 2021 8:02 PM IST
వెబ్ సిరీస్ చూసినందుకు చంపేస్తారా

ఉత్తర కొరియా నియంత కిమ్ జాన్ ఉంగ్ వేసే శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు విధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ను వారి దేశం లోకి USB డ్రైవ్ ద్వారా తీసుకుని వచ్చినందుకు గానూ ఓ వ్యక్తికి మరణ శిక్షవిధించారు. చూసిన టీనేజర్లకు కఠిన శిక్షలు విధించారు. ఆ పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్లకు కూడా శిక్షలను విధించారు.

దక్షిణ కొరియాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'ను యూఎస్‌బిలో చైనా ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నందుకు ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఒక వ్యక్తి చైనా వెళ్లినప్పుడు స్క్విడ్‌ గేమ్‌ను యూఎస్‌బీ డ్రైవ్‌లో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత దాన్ని చూశాడు. ఈ విషయం తెలిసిన అధికారులు 'స్క్విడ్‌ గేమ్' స్మగుల్ చేసినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి మరణశిక్ష విధించారు. అలాగే దీన్ని కొని చూసిన విద్యార్థికి జీవితఖైదు విధించినట్లు తెలుస్తోంది. స్మగ్లర్ నుండి USB కొనుగోలు చేసిన ఒక విద్యార్థికి జీవిత ఖైదు విధించబడింది. అతనితో పాటు దానిని చూసిన మరో ఆరుగురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది.

ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను కూడా విధుల నుండి తొలగించారు. గనులలోని మారుమూల ప్రాంతాలలో పని చేయడానికి వారిని పంపించారు. స్క్విడ్ గేమ్స్ అనేది నెట్‌ఫ్లిక్స్‌లోని ప్రసిద్ధ దక్షిణ కొరియాకు సంబంధించిన డ్రామా సిరీస్. భారీ నగదు బహుమతి కోసం పిల్లల గేమ్‌ లను ఆడిపిస్తారు. షోలో ఓడిపోయిన ఆటగాళ్లకు మరణశిక్ష విధిస్తారు. ఇలా ఇతర దేశాలకు సంబంధించిన షోలను అసలు చూడకూడదని కిమ్ నియమాలను విధించాడు. ఎవరైనా విదేశీ ప్రసారాలను చూస్తూ లేదా వింటూ పట్టుబడితే, వారు కఠినమైన శిక్షలను ఎదుర్కొంటారు. ప్రస్తుతానికి, కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేయబడ్డాయి. టెలివిజన్ డ్రామా ఉత్తర కొరియాలోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరినీ విచారిస్తూ ఉన్నారు.

Next Story