చైనాకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా
Joe Biden On Defending Taiwan If Attacked. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. దీన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది
By M.S.R Published on 22 Oct 2021 11:01 AM GMTతైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. దీన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. కొద్దిరోజుల కిందట తైవాన్ మీద చైనా యుద్ధవిమానాలు కూడా వెళ్లాయి. అయితే చైనా తైవాన్ మీద దాడి చేస్తే అమెరికా ఏ మాత్రం సహించదని వైట్ హౌస్ నుండి ప్రకటన వచ్చింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, తైవాన్‌కు అండగా పోరాడుతామని అమెరికా అధ్యక్షుడ బైడెన్ అన్నారు. ప్రపంచ చరిత్రలోనే అమెరికాది శక్తివంతమైన సైన్యమని చైనా, రష్యా, మిగిలిన దేశాలకు తెలుసు అని బైడెన్ అన్నారు.
తైవాన్‌ను రక్షిస్తామని.. ఆ విషయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. తైవాన్ అంశంలో తమ ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పులేదని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికాకు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. కానీ, 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్'ను అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. అందులో భాగంగా తైవాన్‌కు రక్షణ ఆయుధాలను అమెరికా విక్రయిస్తుంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అమెరికా సహాయం చేస్తుంది.
తైవాన్ తమ దేశానికి చెందిన భూభాగం అని చైనా భావిస్తోంది. తైవాన్ మాత్రం తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. బైడెన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తైవాన్ స్పందించింది. చైనా అంశంలో తమ విధానం ఏమీ మారదని, ఒకవేళ డ్రాగన్ దేశం దాడి చేస్తే, తామే ప్రతిదాడి చేస్తామని తైవాన్ చెప్పింది.