సైకిల్ పై నుంచి కిందపడిన అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్
Joe Biden falls off bike during Delaware ride with first lady.సైకిల్ తొక్కుతూ ఓ వ్యక్తి కిందపడ్డాడు. ఇందులో ఏముంది
By తోట వంశీ కుమార్ Published on
19 Jun 2022 4:04 AM GMT

సైకిల్ తొక్కుతూ ఓ వ్యక్తి కిందపడ్డాడు. ఇందులో ఏముంది..? కొన్ని సార్లు అదుపు తప్పి కిందపడుతుంటారు అని అంటారా..? అలా కింద పడింది మామూలు వ్యక్తి కాదండోయ్.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. అవును మీరు చదివింది నిజం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావేర్‌లోని బీచ్ హోం కి సమీపంలో ఉన్న స్టేట్ పార్క్ లో తన భార్య జిల్ బైడెన్‌తో పాటు మరికొంత మందితో కలిసి సరదాగా సైకిల్‌పై రైడింగ్‌కి వెళ్లారు. అక్కడ ఉన్న కొందరితో మాట్లాడేందుకు సైకిల్ ఆపారు. అయితే.. బ్యాలెన్స్ కోల్పోయి బైడెన్ కిందపడ్డారు. వెంటనే పక్క నున్న వారు బైడెన్‌కు సాయం చేశారు. పైకి లేచిన బైడెన్ తాను బాగానే ఉన్నానని, తనకు ఏం కాలేదని అన్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ సైతం ధ్రువీకరించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
Next Story