జపాన్ ప్రధాని కూడా పానీ పూరీ ఫ్యాన్

Japanese PM Fumio Kishida tried golgappas during his visit to India. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైనది

By Medi Samrat  Published on  21 March 2023 3:23 PM IST
జపాన్ ప్రధాని కూడా పానీ పూరీ ఫ్యాన్

ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైనది, రుచికరమైనది కూడా..! అయితే పానీ పూరీ మాత్రం చాలా ఫేమస్ అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. గోల్గప్పా.. పానీపూరి.. ఫుచ్కా.. బటాషా.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పానీ పూరీకి ఫ్యాన్స్ ఉన్నారు.

అందులో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా ఒకరు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన పానీ పూరీని ఆస్వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ఢిల్లీలోని బుధ జయంతి పార్క్‌లో ప్రధాని మోదీ, ఫుమియో కిషిడా పానీ పూరీని ఆస్వాదిస్తున్న వీడియోను పంచుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌ ప్రధానమంత్రి కిషిదా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత్‌–జపాన్‌ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయనున్నారు.


Next Story