జపాన్‌కు చెందిన సంస్థకు నోబెల్ శాంతి బహుమతి

జపాన్‌కు చెందిన నిహో హిందాక్యో సంస్థకు 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది

By Medi Samrat  Published on  11 Oct 2024 6:45 PM IST
జపాన్‌కు చెందిన సంస్థకు నోబెల్ శాంతి బహుమతి

జపాన్‌కు చెందిన నిహో హిందాక్యో సంస్థకు 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు నిహో హిందాక్యోకు ఈ నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచంలో మళ్లీ అణ్వాయుధాలను ఉపయోగించరాదని సంస్థ ప్రచారం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిపై అణు దాడుల నుండి బయటపడిన వ్యక్తులు ఈ సంస్థను నడుపుతున్నారు. దీనిని జపనీస్ భాషలో హిబాకుషా అంటారు. హిబాకుషా తమ బాధలను, భయంకరమైన జ్ఞాపకాలను ప్రపంచవ్యాప్తంగా నిహాన్ హిడాంకియో సంస్థ ద్వారా పంచుకుంటుంది.

నిహాన్ హిడాంకియోకు ఈ ఏడాది శాంతి బహుమతిని ప్రదానం చేస్తూ నార్వేజియన్ నోబెల్ కమిటీ మాట్లాడుతూ.. అణుదాడితో బాధపడిన వీరు తమ జ్ఞాపకాలను, అనుభవాలను ప్రపంచంతో పంచుకుంటూనే ఉన్నార‌ని పేర్కొంది. అణ్వాయుధాలు ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో కొత్త తరానికి గుర్తు చేస్తూనే ఉంద‌న్నారు. వీటిని మళ్లీ ఉపయోగించకూడదని ప్ర‌చారం చేస్తున్న‌ట్లు పేర్కొంది. ఇదిలావుంటే.. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం మొత్తం 286 మంది అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించింది, అందులో 89 సంస్థలు ఉన్నాయి.

Next Story