వారు దేశభక్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఇవాంక ట్రంప్..!

Ivanka Trump Calls Rioters "American Patriots", Then Deletes Tweet. వారు దేశభక్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఇవాంక ట్రంప్.

By Medi Samrat  Published on  7 Jan 2021 1:20 PM GMT
Ivanka Trump

తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ ఘోర పరాజయం పాలైన సంగతి మనకు తెలిసినదే. ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోవడానికి గల కారణం అతను వ్యవహరించిన తీరేనని పలు సర్వేలు వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అమెరికా 46వ అధ్యక్షుడిగా గత ఎన్నికలలో ఘన విజయం సాధించిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జో బైడన్ త్వరలోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న సంగతి మనకు తెలిసింది.

జో బైడన్ గెలుపును ధృవీకరించే సమావేశాన్ని అడ్డుకోవడం కోసం ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ గొడవలను అణచివేసే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే నలుగురు మరణించారు. ఈ వ్యవహారంపై ట్రంప్ వ్యవహరించిన తీరు సొంత పార్టీ నేతల నుంచి ప్రపంచ దేశాధినేతలు వరకు అతని వ్యవహార శైలిని ఖండిస్తున్నారు. అంతే కాకుండా ఈ వ్యవహారంపై డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారులు అయినా ఇవాంకా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి.

ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడి చేయడంతో అక్కడ జరిగిన ఉద్రిక్తతను తగ్గించాల్సిందే పోయే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈమె చేసిన వ్యాఖ్యలు అక్కడ మరింత తీవ్ర దుమారాన్ని రేపాయి. క్యాపిటల్ భవనంపై దాడి చేసిన ట్రంప్ మద్దతుదారులను ఇవాంకా ట్రంప్ వారిని దేశభక్తులతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఇవాంకా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు వ్యతిరేకిస్తూ ఖండించడంతో ఇవాంక తను చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే ప్రస్తుతం ఇవాంక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Next Story