ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం

Ivana Trump Donald Trump's First Wife Dies At 73.అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2022 4:17 AM GMT
ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం

అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఆయ‌న మొద‌టి భార్య ఇవానా ట్రంప్ క‌న్నుమూసింది. ఆమె వ‌య‌స్సు 73 సంవ‌త్స‌రాలు. ఈ విష‌యాన్ని డోనాల్డ్ ట్రంప్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. న్యూయార్క్ న‌గ‌రంలోని త‌న ఇంట్లో ఇవానా ట్రంప్ క‌న్నుమూసిన‌ట్లు చెప్పాడు. అయితే.. ఆమె మ‌ర‌ణించడానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం చెప్ప‌లేదు.

"న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్ తుదిశ్వాస విడిచింది. ఈ విష‌యాన్ని ఆమెను ప్రేమించిన వారందరికీ తెలియజేయడానికి నేను చాలా బాధపడ్డాను. ఆమె అద్భుతమైన, అందమైన మరియు అద్భుతమైన మహిళ, ఆమె స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపింది. ఆమె పట్ల మేమూ గ‌ర్వ‌ప‌డుతున్నాం. రెస్ట్ ఇన్ పీస్, ఇవానా! "అని డొనాల్డ్ ట్రంప్ త‌న సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

ట్రంప్ కుటుంబం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. "మా ప్రియమైన తల్లి ఇవానా ట్రంప్ మరణించినట్లు మేము ప్రకటించడం చాలా విచారంగా ఉంది. మా అమ్మ ఒక అద్భుతమైన మహిళ. వ్యాపారంలో శక్తి, ప్రపంచ స్థాయి అథ్లెట్, శ్రద్ధగల తల్లి, ఓస్నేహితురాలు. ఆమె కమ్యూనిజం నుండి పారిపోయి ఈ దేశాన్ని ఆలింగనం చేసుకుంది" అని ప్రకటన కొనసాగింది.

ఇవానా ట్రంప్ ఓ మోడ‌ల్‌. 1977లో రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ట్రంప్‌ను వివాహ‌మాడింది. వీరికి డోనాల్డ్ జూనియర్, ఇవాంకా మరియు ఎరిక్ సంతానం కొన్ని కార‌ణాల వ‌ల్ల 1992లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ త‌రువాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో వివాహం చేసుకోగా ఆమెతోనూ విడిపోయాడు. చివ‌రగా 2005లో మెలానియాను ట్రంప్ మూడో వివాహం చేసుకున్నాడు.

Next Story