సీజ్ ఫైర్ ను పట్టించుకోకుండా షాకిచ్చిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా.. ఈ కాల్పుల విరమణ కేవలం కొద్దిసేపే సాగింది.

By Medi Samrat  Published on  29 Nov 2024 9:15 PM IST
సీజ్ ఫైర్ ను పట్టించుకోకుండా షాకిచ్చిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా.. ఈ కాల్పుల విరమణ కేవలం కొద్దిసేపే సాగింది. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌లో తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. రాకెట్‌ నిల్వ కేంద్రంలో హిల్బుల్లా మిలిటెంట్లు చురుకుగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో వెంటనే దాడులు చేశామని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుగా ఉల్లంఘించింది హిజ్బుల్లా సంస్థనే అని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.

గత 10 నెలలుగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కొందరు నిషేధిత ప్రాంతాల్లోకి కూడా ప్రవేశించారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. సరిహద్దు గ్రామాలకు ఇంకా రావొద్దని, బలగాల ఉపసంహరణ పూర్తయ్యాకే రావాలని ప్రజలకు సూచించింది ఇజ్రాయెల్. హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము వారి ప్రదేశంలోకి ప్రవేశించి దాడి చేస్తామని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించింది. చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు దిగింది.

Next Story