సిరియా దేశంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ఐఎస్‌ఐఎస్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ హతమైనట్లు అమెరికా గురువారం ప్రకటించింది. "నా దిశానిర్దేశం మేరకు గత రాత్రి, వాయువ్య సిరియాలోని యూఎస్ సైనిక బలగాలు అమెరికన్ ప్రజలను, మా మిత్రదేశాలను రక్షించడానికి, ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి ఉగ్రవాద నిరోధక చర్యను విజయవంతంగా చేపట్టాయి" అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. "మా సాయుధ దళాల నైపుణ్యం, ధైర్యసాహసాలకు ధన్యవాదాలు, మేము ఐసిస్ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీని యుద్ధభూమి నుండి తొలగించాము. అమెరికన్లందరూ ఆపరేషన్ నుండి సురక్షితంగా తిరిగి వచ్చారు. "అని వైట్‌హౌస్ పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురువారం తర్వాత అమెరికన్ ప్రజలకు ఈ విషయం చెప్తారని వైట్ హౌస్ తెలిపింది. యూఎస్ మీడియా నివేదికల ప్రకారం.. ఐసిస్ చీఫ్ అల్-ఖురేషీ 2004 నుండి ఇరాక్‌లోని యూఎస్ ఆధ్వర్యంలో నడిచే బుక్కా క్యాంప్‌లో బంధించబడ్డాడు. అతను ఐఎస్ యొక్క పూర్వ సంస్థలో చురుకుగా ఉన్నాడని, చివరికి ఐఎస్ మాజీ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ అత్యంత విశ్వసనీయ డిప్యూటీలలో ఒకడు అయ్యాడని నివేదికలు పేర్కొన్నాయి.