ఇరాన్‌తో యుద్ధం క్లైమాక్స్‌కు?.. గంటల్లోనే మాట మార్చిన అధ్యక్షుడు!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య దాదాపు ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

By -  అంజి
Published on : 10 March 2026 6:55 AM IST

Donald Trump, Iran-US War, Israel Military Campaign, Tehran, White House, Republican Conference, Military Conflict 2026

ఇరాన్‌తో యుద్ధం క్లైమాక్స్‌కు?.. గంటల్లోనే మాట మార్చిన అధ్యక్షుడు!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య దాదాపు ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌పై సాగుతున్న ఈ దాడులు "చాలా వరకు పూర్తయ్యాయని" ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే మరో కార్యక్రమంలో ఆయన భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో ప్రసంగిస్తూ.. తాము అనేక విషయాల్లో విజయం సాధించామని, కానీ ఇంకా "పూర్తిగా గెలవలేదని" ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ పూర్తిగా, నిర్ణయాత్మకంగా ఓడిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం ఒక రకంగా, సాయంత్రం మరో రకంగా ఆయన మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సిబిఎస్ న్యూస్ వైట్ హౌస్ రిపోర్టర్ వీజియా జియాంగ్ ప్రకారం.. ట్రంప్ ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ యుద్ధం నిర్ణీత సమయం కంటే ముందే వేగంగా సాగుతోందని చెప్పారు. "ఇరాన్‌కు ఇప్పుడు నౌకాదళం లేదు, సమాచార వ్యవస్థలు లేవు, కనీసం వైమానిక దళం కూడా లేదు" అని ట్రంప్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం సుమారు 4 నుండి 5 వారాల పాటు కొనసాగుతుందని ఆయన గతంలో అంచనా వేశారు.

Next Story