ఇండోనేషియాలో 11 మందితో ప్రయాణిస్తోన్న విమానం అదృశ్యం
ఇండోనేషియా లో ఒక ప్రయాణికుల విమానం 11 మందితో పాటు అదృశ్యం అయ్యింది.
By - Knakam Karthik |
ఇండోనేషియాలో 11 మందితో ప్రయాణిస్తోన్న విమానం అదృశ్యం
జకార్టా: ఇండోనేషియా లో ఒక ప్రయాణికుల విమానం 11 మందితో పాటు అదృశ్యం అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:17 కి లాస్ట్ కాన్టాక్ట్ (విమాన నిర్వహణ నియంత్రణతో) కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. ఇది యోగ్‌యకర్తా నుండి మకాసర్ నగరానికి ప్రయాణిస్తున్న సందర్భంలో జరిగింది. విమానంలో మొత్తం 11 మంది ఉన్నట్లు నమోదు, ఇందులో 8 మంది క్రూ (విమానసిబ్బంది) మరియు 3 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ప్రస్తుతం గాలింపు మరియు రక్షణ చర్యలు భారీగా నడుస్తున్నాయి హెలికాప్టర్లు, డ్రోన్‌లు, భూమి బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి .చివరిసారి రాడార్‌లో కనిపించిన ప్రాంతం సౌత్ సులావేసి లోని Maros Regency (Leang-Leang) ప్రాంతం వద్దని అధికారులు తెలిపారు . కొంతమంది ప్రత్యక్ష సాక్షులు విమానం ముద్రలతో పగిలిపోయిన భాగాలు మరియు చిన్న మంటలు కనిపించాయని చెప్తున్నారు. కానీ అధికారికంగా ఇవి ధ్రువీకరించబడలేదు. ఇండోనేషియా ప్రయాణికుల విమానం ATR 42-500 అదృశ్యం అయింది. సంబంధిత అధికారులు ప్రస్తుతం గాలింపు , రక్షణ చర్యలను వేగంగా చేపడుతున్నారు, ఇంకా ఎలాంటి అధికారిక ప్రమాద నివేదిక వెలువడలేదు.