బాలి సముద్రంలో గల్లంతైన సబ్‌మెరైన్ మునిగిపోయిందని, అందులోని 53మంది సిబ్బంది మృతి చెందినట్లేనని ఇండోనేసియా నేవీ అధికారికంగా ప్రకటించింది. బుధవారం గల్లంతైన జలాంతర్గామి కోసం జరిపిన అన్వేషణలో సబ్‌మెరైన్ తాలుకా విడిభాగాలు లభ్యమయ్యాయి. వీటిని బట్టి సబ్‌మెరైన్ మునిగిపోయి ఉంటుందని ప్రకటించింది. శనివారం ఉదయం వరకే అందులోని ఆక్సీజన్ సరిపోతుందని, అందువల్ల దానిలోని సిబ్బంది బతికే అవకాశమే లేదని భావిస్తున్నట్లు తెలిపింది.
జలాంతర్గామి గల్లంతైన ప్రాంతంలో చమురు తెట్టలు, ధ్వంసమైన భాగాలు లభించాయి. ఇవి జలాంతర్గామి మునకకు ప్రధాన సాక్ష్యాలని ఆ దేశ మిలటరీ చీఫ్ హది జజాంటో చెప్పారు. నిన్న మొన్నటి వరకూ సబ్‌మెరైన్ గల్లంతైందని ఇండోనేసియా చెబుతూ వచ్చింది. ఇది పెళ్లి మొక్కలే అంటే ఆ శకలాలు నీటిమీద చాలా త్వరగా కనిపించేవి.. అలా కాకపోవడం తో అది నీటిలో మునిగిపోయింది తేల్చి చెప్పారు. జలాంతర్గామి 655 అడుగుల వరకు నీటిలోపలకి వెళ్లే సామర్ధ్యం కలిగి ఉండగా, ఈ ప్రమాదంలో అది దాదాపు 2000– 2300 అడుగుల లోతుకు మునిగి ఉంటుందని నేవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థాయిల్లో నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ పీడనాన్ని జలాంతర్గామి తట్టుకోలేదని వివరించారు.
సుమారు 12 హెలికాఫ్టర్లు ఈ జలాంతర్గామి కోసం అన్వేషణ కు దిగాయి. సముద్ర గర్భంలో క్షిపణి ప్రయోగం డ్రిల్ కోసం వెళ్లేందుకు అనుమతి తీసుకుని బయలుదేరిన ఈ జలాంతర్గామి 40 సంవత్సరాల క్రితం జర్మనీ తయారుచేసింది.
ఈ సబ్‌మెరైన్ కండిషన్‌లోనే ఉందని ఇండోనేసియా నేవీ తెలిపింది. కానీ, ఇది మునిగిన తీరు చూస్తే ఇందులో ఉన్న ఇంధన ట్యాంకు దెబ్బ తిన్నదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సబ్‌మెరైన్ కి సంబంధించిన అనేక భాగాలు లభించినట్లు చెప్పారు. అయితే, ఈ క్షిపణిని ప్రయోగించే లాంచర్ లో బీటలు వాటిల్లడం వల్ల గాని, లేదా వెలుపల నుంచి ఒత్తిడి వస్తే తప్ప ఈ భాగాలు సబ్ మెరైన్ ని వీడి బయటకు రావని నేవీ చీఫ్ తెలిపారు.