ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందుకున్నారు.

By అంజి  Published on  14 July 2023 6:06 AM GMT
Prime Minister Modi , France, grand cross of the legion of honour, International news

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది. 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్' అనే పురస్కారంతో మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ సత్కరించారు. ఇది ఫ్రాన్స్‌కు చెందిన అత్యున్నత మిలటరీ లేదా పౌర పురస్కారం. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. పారిస్‌లోలోని ఎలిసీ ప్యాలెస్‌లో మేక్రాన్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం.

జర్మనీ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్‌ గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్ పురస్కారాన్ని అందుకుంటున్న మోదీ ఫొటోలను విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. పురస్కారం అందుకున్న అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపినట్టు బాగ్చి పేర్కొన్నారు. అంతకుముందు మేక్రాన్, ఆయన భార్య, ప్రథమ పౌరురాలు బ్రిగెట్టి మేక్రాన్ ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఇచ్చారు.

Next Story