వచ్చే నెలలో భారత ప్రధాని యూఎస్ టూర్.. మోడీతో ఫోన్ మాట్లాడిన తర్వాత ట్రంప్ ప్రకటన

ప్రధాని మోడీ వచ్చే నెలలో అమెరికా టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో మోడీ వైట్‌ హౌజ్‌ను విజిట్ చేయనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

By Knakam Karthik
Published on : 28 Jan 2025 11:15 AM IST

International News, Prime Minister Modi, America President Donald Trump, Phone Call

వచ్చే నెలలో భారత ప్రధాని యూఎస్ టూర్.. మోడీతో ఫోన్ మాట్లాడిన తర్వాత ట్రంప్ ప్రకటన

ప్రధాని మోడీ వచ్చే నెలలో అమెరికా టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో మోడీ వైట్‌ హౌజ్‌ను విజిట్ చేయనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో భారత ప్రధాని మోడీ వైట్ హౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇండియాతో తమకు మంచి రిలేషన్ ఉందని ట్రంప్ పేర్కొన్నారు.

మోడీతో ఫోన్‌లో అన్ని అంశాల గురించి చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. తొలిసారి దేశాధ్యక్షుడిగా చేసిన సమయంలో.. ట్రంప్ తన చివరి పర్యటన సందర్భంగా ఇండియాకే వచ్చారు. భారత్, అమెరికా దేశాల సంబంధాల మరింత బలోపేతం చేసుకోవడంలో మోడీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహ బంధం కీలక పాత్రం పోషించనుంది. 2019లో హూస్ట‌న్‌లో జ‌రిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్ర‌వ‌రిలో అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ భేటీలో చైనా దూకుడును అడ్డుకోవడంపై నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు, H-1B వీసా తదితర అంశాలను మోడీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. అలాగే అమెరికా వస్తువులపై భారత్‌ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్‌ ఈ అంశాన్ని మోడీతో చర్చించే అవకాశముంది. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్‌ ముందుంచాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం

Next Story