బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రెవ‌ర్మాన్

Indian-origin Suella Braverman appointed UK Home Secretar. భార‌త సంత‌తికి చెందిన న్యాయ‌వాది సుయెల్లా బ్రెవ‌ర్మాన్ బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు.

By Medi Samrat  Published on  7 Sep 2022 2:00 PM GMT
బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రెవ‌ర్మాన్

భార‌త సంత‌తికి చెందిన న్యాయ‌వాది సుయెల్లా బ్రెవ‌ర్మాన్ బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు. అంతకు ముందు ఆ బాధ్యతలను భార‌తీయ సంత‌తి మ‌హిళ ప్రీతి ప‌టేల్ నిర్వహించేవారు. ఆమె స్థానంలో బ్రెవ‌ర్మాన్ ఆ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌నున్నారు. రెండు రోజుల క్రితం బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్ ఎన్నికవ్వగా.. ఆమె కొత్త క్యాబినెట్‌ను విస్త‌రిస్తున్నారు. బ్రిట‌న్ కన్జ‌ర్వేటివ్ పార్టీ నేత‌గా లిజ్ ట్ర‌స్ ఎన్నికవ్వడంతో.. ఆమె ఆ దేశ కొత్త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు. క‌న్జ‌ర్వేటివ్ రేసులో లిజ్ ట్ర‌స్‌కు 81,326 ఓట్లు పోల‌య్యాయి. రిషి సునాక్‌కు 60,399 ఓట్లు ప‌డ్డాయి. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను ఓడించారు. లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్ కు 60,399 ఓట్లు లభించాయి. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచిపోనున్నారు. బోరిస్ జాన్స‌న్ ప్ర‌ధాని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌డంతో.. క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో పోటీ జ‌రిగింది. రిషి సునాక్‌, లిజ్ ట్ర‌స్ మ‌ధ్య చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ పోరు సాగింది.

ఇప్పుడు లిజ్ ట్రస్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆమె అందుకు తగ్గట్టుగా తన క్యాబినెట్ ను విస్తరిస్తూ ఉన్నారు. 42 ఏళ్ల కన్జ‌ర్వేటివ్ పార్టీ నేత అయిన బ్రెవ‌ర్మాన్‌ బోరిస్ ప్ర‌భుత్వంలో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా చేశారు. బ్రెవ‌ర్మాన్‌ను హోంశాఖ మంత్రిగా లిజ్ నియ‌మించారు. సుయెల్లా బ్రెవ‌ర్మాన్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ఆమె త‌ల్లి త‌మిళ వ్య‌క్తి. తండ్రి గోవా ఆర్జిన్‌కు చెందిన వ్య‌క్తి. ఆయ‌న పేరు క్రిస్టీ ఫెర్నాండేజ్‌. మారిష‌స్ నుంచి త‌ల్లి బ్రిట‌న్‌కు వ‌ల‌స వ‌చ్చింది. 1960 ద‌శ‌కంలో తండ్రి కెన్యా నుంచి వ‌ల‌స వెళ్లారు. కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీలో న్యాయ విద్య‌ను అభ్య‌సించారు. 2018లో రాయ‌ల్ బ్రెవ‌ర్మాన్‌ను ఆమె పెళ్లాడారు. క్యాబినెట్ మంత్రిగా ఉంటూనే ఆమె రెండో పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. బ్రెవ‌ర్మాన్ బౌద్ద మ‌తాన్ని స్వీక‌రించారు.


Next Story