అమెరికాలో దారుణానికి పాల్పడ్డ భరత్ నారుమంచి
Indian-origin pediatrician fatally shoots another doctor. అమెరికాలో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు ఆసుపత్రిలో చొరబడి వైద్యురాలిని కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది.
By Medi Samrat Published on 29 Jan 2021 10:04 AM GMT
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు ఆసుపత్రిలో చొరబడి వైద్యురాలిని కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది. ఓ వైద్యురాలిని చంపిన తర్వాత ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని భరత్ నారుమంచిగా గుర్తించారు. 43 ఏళ్ల భరత్ చిన్నపిల్లల వైద్యుడు. భరత్ ప్రాణాంతక క్యాన్సర్ బారినపడ్డాడు. అతడు జీవితం చివరి దశలో ఉన్నాడు. మరికొన్ని వారాలకు మించి బతికే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పారు.
భరత్ ఇటీవల చిల్డ్రన్ మెడికల్ గ్రూప్ అనే బాలల వైద్య సేవల సంస్థలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోగా, అతడి దరఖాస్తును అధికారులు అంగీకరించలేదు. ఈ క్రమంలో, భరత్ తుపాకీ చేతబూని ఆ మెడికల్ గ్రూప్ కేంద్రంలో ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకున్నాడు. వారిలో కొందరు తప్పించుకోగా, క్యాథరిన్ లిండ్లే డాడ్సన్ అనే లేడీ డాక్టర్ ను భరత్ కాల్చి చంపాడు. ఆపై తాను కూడా కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. భరత్ నారుమంచి తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రెండు పెద్ద బ్యాగులు, ఒక తుపాకీతో ఆ ఆస్పత్రిలోకి భరత్ ప్రవేశించారు. ఆస్పత్రిలో పిల్లలు గానీ రోగులు గానీ ఆ సమయంలో లేరు. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. నారుమంచి ఒక్కసారిగా తుపాకీ ఎక్కుపెట్టి లిండ్లే డాడ్సన్ సహా ఐదుగురు వైద్యులను బందీలుగా తీసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా ఏకంగా ఆరుగంటల పాటు టెన్షన్ నెలకొంది. బందీలైన వైద్యుల్లో నలుగురిని భరత్ విడిచిపెట్టడమో జరిగిందిట్టాడు. మిగిలిన ఒకే ఒక్క వైద్యురాలు లిండ్లే డాడ్సన్‌ను భరత్ తుపాకీతో కాల్చి చంపారు. ఆపై తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచాడు. ఆస్టిన్‌లో మంచి హస్తవాసి ఉన్న చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా కేథరిన్ లిండ్లే డాడ్సన్‌కు చక్కని పేరుంది.