భారతదేశానికి చెందిన బాబు అనే మత్స్యకారుడు కరాచీ జైలులో గురువారం మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. "అతన్ని 2022లో పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారు. అతని శిక్షాకాలం పూర్తయినప్పటికీ బయటకు రాలేదు. భారత జాతీయతను ధృవీకరించినప్పటికీ, పాకిస్తాన్ అధికారులు అతన్ని విడుదల చేయలేదు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత రెండేళ్లలో పాకిస్థాన్‌లో ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులు మరణించారు. శిక్షలు పూర్తి చేసుకున్న 180 మంది భారతీయ మత్స్యకారులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఖైదీలను ముందస్తుగా విడుదల చేయాలనే అంశాన్ని పాకిస్థాన్‌తో భారత్ చర్చిస్తూనే ఉంది.